![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -838 లో.. రిషితో వసుధార మాట్లాడుతూ.. మహేంద్ర ఫోన్ చేసిన విషయం చెప్తుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మహేంద్ర సర్ చెప్పారని వసుధార అనగానే.. మరి నాకు చేసి చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు. మీకు ఫోన్ చేస్తే మీరు చిరాకుపడి మాట్లాడుతారో లేదోనని వాళ్ళు మీకు చెయ్యలేదని వసుధార అంటుంది. మీరు ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ చేసి ఎటాక్ కి సంబంధించి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కోండని వసుధార అంటుంది. కనుక్కుంటాను.. ఏంటి నీ దబాయింపు. టెన్షన్ పడవద్దు బాగున్నాడని డాడ్ వాళ్ళకి చెప్పండని రిషి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరొక వైపు రిషిపై శైలేంద్ర ఎటాక్ గురించి దేవాయనికి చెప్తాడు. కొంచమైతే ఆ రిషిగాడికి దొరికిపోయేవాన్ని అని శైలేంద్ర అంటాడు. నువ్వు అవన్నీ ఇక ఆపేసి ముందు కాలేజీ గురించి ఆలోచించు.. కాలేజీకి వెళ్ళమని దేవయాని అంటుంది. అప్పుడే వచ్చిన ఫణింద్ర మంచి మాట చెప్పావ్ దేవయాని అంటాడు. శైలెంద్ర మాత్రం వాళ్ళ మాటలు విన్నాడెమోనని టెన్షన్ పడుతాడు. నువ్వు కాలేజీకి వచ్చి కాలేజీ గురించి తెలుసుకుంటే.. అంతకంటే ఏం కావాలి. అది ఎందుకు.. ఇది ఎందుకు అంటావ్? అందుకే అందరికి నీపై చిరాకు వస్తుందని ఫణింద్ర అంటాడు. సరే డాడ్ కాలేజీ వస్తానని శైలేంద్ర అంటాడు. అప్పుడే అక్కడకి మహేంద్ర వస్తాడు. శైలేంద్ర కాలేజీ కి వస్తాను అంటున్నాడు.. నువ్వేమంటావని మహేంద్రని అడుగుతాడు ఫణీంద్ర. మీ ఇష్టం అన్నయ్య మీ మాట ఎప్పుడు కాదని అనలేదని మహేంద్ర అంటాడు. పిన్ని ఏమైనా అంటుందేమోనని శైలేంద్ర అంటాడు. అదేం లేదు ఎవరికి ఎలా నేర్పించాలో, అందరికి అలా నేర్పిస్తామని మహేంద్ర అంటాడు. నా ముందు ఎంత యాక్టింగ్ చేస్తున్నావని మహేంద్ర అనుకుంటాడు. మరొక వైపు రిషి ఇన్‌స్పెక్టర్ తో ఎటాక్ గురించి మాట్లాడుతాడు.
ఆ తర్వాత విశ్వనాథ్ కిందపడిపోతాడు. రిషి అంటూ ఏంజెల్ పిలుస్తూ ఏడుస్తుంది. రిషి వచ్చి.. డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. మరొక వైపు వసుధార కాలేజీకి వెళ్లి ఇంకా రిషి సర్ రాలేదని ఎదురుచూస్తుంది. మరొక వైపు విశ్వనాథ్ దగ్గరికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత విశ్వనాథ్ కి అలా జరిగేసరికి ఏంజిల్ ఎమోషనల్ అవుతుంది. రిషికి ఏంజెల్ గురించి విశ్వనాథ్ చెప్తాడు. తనకి నేను తప్ప ఎవరు లేరు.. పెళ్లి చేసుకోమంటే.. నన్ను వదిలి వెళ్ళాల్సి వస్తుందని పెళ్లి వద్దని అంటుందని విశ్వనాథ్ రిషికి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. నేను అనుకున్నది జరుగుతుంది అంటావా రిషి అని విశ్వనాథ్ అంటాడు. మీరు ఇప్పుడు అవన్నీ ఆలోచించకండని రిషి అంటాడు. మరొక వైపు రిషికి విశ్వనాథ్ గురించి ఏంజిల్ చెప్తూ.. ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |